మంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయకనిధి (CMRF) చెక్కులు 106 మంది లబ్దిదారులకు 32,38,500/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, లక్షెటిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





