ప్రాంతీయం

ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

63 Views

ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

సిద్దిపేట్  జిల్లా మర్కుక్ జనవరి 16

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు న్యాలపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మైస రాములు హాజరయ్యారు. అనంతరం  మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సందర్భంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఎస్సి వర్గీకరణ సాధించుకోవడానికి ముందు వరుసలో ఉండాలని వారు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు మాదిగ, గజ్వేల్ అసెంబ్లీ కన్వినర్ శనిగరి రమేష్ మాదిగ, మర్కుక్ మండలం ఇంచార్జి బొమ్మని మహేష్ మాదిగ, మర్కుక్ మండలం అధ్యక్షులు మొండి రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు మొండి బిక్షపతి మాదిగ, జాలని యాదగిరి మాదిగ, చాట్లపల్లి చిన్ని కృష్ణ మాదిగ, కర్రోళ్ల నర్సింలు మాదిగ, జాలని కరుణాకర్ మాదిగ, గ్రామ పెద్దలు బక్కల సత్తయ్య, న్యాలపల్లి పెంటయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్