అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి
– 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 30 వరకు అవకాశం
– బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్,
బెల్లంపల్లి జనవరి16
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ చదువుతున్న 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థిని విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. ఏకాంబరం తెలిపారు. ఈ సెమిస్టర్ లకు సంబంధించిన పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు పై విషయాన్ని గమనించి వెంటనే ఫీజు చెల్లించాలని సూచించారు. ఇతర వివరాలకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని కోరారు.
