ప్రాంతీయం

బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు

40 Views

మర్కూక్ మండల కేంద్రంలో ఘనంగా బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు

 బహుజన నాయకురాలు బిఎస్పి అధినేత్రి బెహన్జి కుమారి మాయావతి అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు

-కొండనోళ్ల నరేష్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి 

సిద్దిపేట్ జిల్లా మర్కుక్  జనవరి 15

గజ్వేల్ నియోజకవర్గం, మర్కూక్ మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ ఆశయ రథ సారథి బహుజన నాయకురాలు బిహెంజి మాయావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మర్కూక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పేషెంట్లకు మరియు పాములపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కటింగ్ చేసి బెహన్జి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ బెహెన్జీ మాయావతి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బిహేన్జీ పుట్టిన రోజును బహుజన్ నాయక్ మాన్యశ్రీ కాన్సీరామ్, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఉద్దేశ్యం తో”జనకళ్యాణ్ దివాస్” గా ప్రకటించిన నేపథ్యంలో అందరికీ “జన కళ్యాణ్ దివాస్” శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శర్దని రాము, సింగర్ కర్రోళ్ల నవీన్, రాజంగారి భాను, కొండనోళ్ళ వంశి, తెడ్డు నవీన్, అభిషేక్ , కొండనోళ్ళ శ్రీకాంత్, కర్రోళ్ళ మహేష్, అక్కారం భాను, మొద్దు క్రాంతి కుమార్ మరియు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్