ప్రాంతీయం

చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ సిహెచ్. గణేష్…

30 Views

ముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి):  ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే మాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయన్నారు. ఆదివారం గాలి పటాలు విక్రయించే షాపులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్