ప్రాంతీయం

గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ

33 Views

మంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట.

గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికే కబడ్డీ పోటీలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకోని రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలానే ఉద్దేశంతో ప్రతి ఏడాది కబడ్డీ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని రఘునాథ్ తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లాలోని యువతను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరిన్ని క్రీడా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. క్రీడలతో పాటు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, ఎనగందుల కృష్ణ మూర్తి, గుండా ప్రభాకర్, మాధవరపు వెంకట రామన్ రావు, గాదె శ్రీనివాస్, మోటపలుకుల గురవయ్య, రమేష్ జైన్, బొప్పు కిషన్, కనుగంటి మల్లయ్య, నరేష్ జైన్, తగరపు గంగన్న, సిద్ధార్థ, సమరసింహా, వెంకటేష్, వెంకట రామన, తులసి, పాంచాల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్