శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో
భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన
– ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
భద్రాచల దేవస్థానం ఈనెల 10న ఘనంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)కి సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలు, శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత 26సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి లిఖింపజేస్తున్న ఆధ్యాత్మిక సేవను గుర్తించి నేడు భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలను, గోడ పత్రికలను ప్రతి సంవత్సరం పంపించడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అన్నారు. రాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడు అని కొనియాడారు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమే ఈ ముక్కోటి ఏకాదశి అని అన్నారు.
సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ఉత్తర ద్వారా దర్శనం వల్ల కోటిపుణ్యాల ఫలితం కలుగుతుందన్నారు. రామకోటి రామరాజును మరో భక్త రామదాసుగా భద్రాచల దేవస్థానం గుర్తించడం అయన భక్తికి నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రామచంద్ర, దూబకుంట మెట్రాములు, రాచకొండ శ్రీనివాస్, కుమ్మరి మల్లేశం, బయ్యారం నర్సింలు పాల్గొన్నారు
