మంచిర్యాల జిల్లా.
సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ సంక్షేమ సంఘం.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్లో చదువుల తల్లి, గొప్ప సంఘ సంస్కర్త, సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు.అదేవిదంగా సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సాతార జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి 3 తారీఖున జన్మించి తాను 9వ ఏటనే 13 సంవత్సరాలు గల మహాత్మ జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. బ్రాహ్మణీయ వ్యవస్థ బడుగు బలహీన వర్గాల పై చూపుతున్నటువంటి కుల వివక్ష అంటరానితనం చూసి చలించిపోయి తన భర్త జ్యోతిరావు పూలే గారి సహకారంతో చదువు నేర్చుకుని భారత దేశములోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలు కావడం జరిగింది.బడుగు భలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని 1848 సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించి చదువు నేర్పించే క్రమంలో అణగారిన ప్రజలకు చదువు నేర్పించొద్దని బ్రాహ్మణీయ వ్యవస్థ సావిత్రిబాయి పూలే గారిపై పేడ నీళ్లు బురద చల్లిన కూడా సంచిలొ చీర జాకెట్ పెట్టుకొని వెళ్లి చదువు నేర్పించిన గొప్ప మహనీయురాలని తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతువులు పునర్వివాహంల కోసం పోరాటం చేస్తు వృద్ధుల, వితంతువుల కోసం సత్యశోధకు సమాజం స్థాపించి ఆశ్రమం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడాలి.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు కాటం రాజేశం,గడ్డం సత్యం,అధ్యక్ష, కార్యదర్శులు కలగూర లింగయ్య, దుర్గం స్వామి, సాగే సుమోహన్,అధికార ప్రతినిధి కుంటాల శంకర్, వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్,ఉపాధ్యక్షులు సిహెచ్ రాజమల్లు,నేరల్ల శంకర్,జుమ్మిడి గోపాల్, చిప్పకుర్తి ఐలయ్య,దుర్గం ఎల్లయ్య,సిర్ర దివాకర్, లు పాల్గొన్నారు.
