ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం

566 Views

మంచిర్యాల జిల్లా.

*మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం*

నిన్న రాత్రి 7.00 గంటల సమయంలో కాగజ్ నగర్ నుండి కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తిని చెస్ట్ పెయిన్ వస్తుందని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రి అయినా *టచ్ హాస్పటల్* కి తీసుకువచ్చారు.అయితే తీసుకు వచ్చినప్పుడు ఇతనికి చికిత్స చేయడానికి ఆసుపత్రి సిబ్బంది చికిత్స ఖర్చు అక్షరాల 1,80,000 నుండి 2,00000 వరకు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది వారు ప్యాకేజీ కూడా మాట్లాడాలని తెలియజేశారు.1,50,000 కౌంటర్లో కట్టించుకున్నారని డబ్బులు కట్టిన తర్వాత 45 నిమిషాలకు పేషెంట్ చనిపోయాడని తెలియజేశారని తెల్లవారి చనిపోయిన డెడ్ బాడీని తీసుకువెళ్లాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగితే 4,50,000 రూపాయల బిల్ అయింది. మిగతా మూడు లక్షల రూపాయలు చెల్లించి మీరు డెడ్ బాడీ ని తీసుకు వెళ్ళండి అని తెలియజేశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇలాంటి దారుణంగా వ్యవహరించే, ప్రజల ప్రాణాలతో ఆడుకునే హాస్పిటల్ లపై ప్రభుత్వం తగిన చర్య తీసుకొని హాస్పిటల్ యొక్క లైసెన్సు రద్దుచేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్