- ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. శివరాత్రి నరేష్,అతని తండ్రి రాజు లు కలిసి చేతులతో కుర్చీతో దాడి చేయగా పరశురాములు తలకు తీవ్ర గాయాలు అయ్యాయని బాధితుడు ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమో చేశామని ఎస్సై రమాకాంత్ విలేకరులకు తెలిపారు.
