బాధిత కుటుంబానికి అండగా…
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధ
సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20
జగదేవపూర్ : మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జడల పర్శరాములు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు.రాష్ట ప్రభుత్యం తరుపున బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్పారు.
మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే ఆనందం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిమరి కిష్టయ్య, సంతోష్ రెడ్డి,చిక్కుడు నర్సింలు,చెక్కల పోచయ్య,కొత్త పల్లి కృష్ణ, ద్యాప యాదగిరి,మల్లయ్య, చంద్రం,కుమార్, తదితరులు పాల్గొన్నారు.





