మంచిర్యాల జిల్లా.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.
నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ.
ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎలక్షన్ లో నాకు మొదటి ప్రాధాన్యతగా మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఎమ్మెల్సీ పట్టభదల అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్టబద్రుల ఓటర్లను నరేందర్ రెడ్డి కోరారు.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల సభ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మరియు మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సభలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా నాకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పట్టభద్రులు అందరూ మొదట ప్రాధాన్యతగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని వివిధ విద్యాసంస్థల అధినేతలు, ముఖ్య కార్యకర్తలు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సిబ్బంది మరియు మంచిర్యాల జిల్లా పట్టభద్రులు , మీడియా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
