ప్రాంతీయం

గీట్ల సునీత అధ్యక్షతన 4వ తరగతి కార్యవర్గ సమావేశం

162 Views

మంచిర్యాల జిల్లా.

నేడు గీట్ల సుమీత్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మన దేశ మాజీ ప్రధాన మంత్రివర్యులు డాక్టర్ మనోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకొని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల యూనియన్ మంచిర్యాల జిల్లా తరుపున ప్రగాఢ సంతాపం మరియు 2 నిముషాలు మౌనం పాటించడం జరిగింది.
ఎజెండా అంశాలు కూడా చర్చించడం, అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు వివిధ ప్రభుత్వ శాఖలలో ఏర్పడుతున్న నాల్గవ తరగతి ఉద్యోగుల ఖళీ పోస్టులను భర్తీ చేయాలని వివిధ శాఖలలో ఉద్యోగులపై పెట్టి చాకిరి చేయించుతూ పనిబారం పెరగడం జరుగుతున్నాయి దీని పై
రాష్ట్ర నాయకులతో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకుపోవడం పై చర్చ జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నాలుగు విడుదల డి ఎ పై చర్చ, మరియు పెండింగ్ లో ఉన్న పి ఆర్ సి కూడా అమలు చేయాలని ప్రధాన డిమాండ్ పై చర్చ, మరియు పెండింగ్ లో ఉన్న చాలా బిల్స్ ను క్లియర్ చేయాలని ప్రధాన డిమాండ్ గా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నుండి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు
జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్
ప్రధాన కార్యదర్శి గోవర్ధన్,కోశాధికారి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found