ప్రాంతీయం

పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది

79 Views

మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం.

పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది.

పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి.

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి.

దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు.

కాసిపేట మండలం దెవాపూర్ పూర్ లో ఎం డి ఎం కార్మికుల సమావేశంలో.

పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు వండి పెడుతున్న బియ్యం ముక్కిపోయి,పురుగులు పట్టి ఉన్న అధికారులు సివిల్ సప్లై ద్వారా సరఫరా చేస్తున్నారు.భోజనం చేసే పిల్లలు అనారోగ్యానికి గురైతే అధికారుల బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత 4 నెలలుగా బిల్లులు, వేతనాలు రాకపోవడం మూలంగా అప్పుల పాలై వంట నిర్వాణ చేయడం కోసం మరిన్ని అప్పులు చేయడం జరుగుతుంది.
వెంటనే బిల్లులు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే 10 వేల రూపాయల వేతనం,ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సంవత్సరం గడిచిన నేటికీ అమలు చేయ్యడం లేదు.పైగా మధ్యాహ్న భోజన కార్మికులపైన రోజు రోజుకు బారాలను వేస్తుంది.
గత ప్రభుత్వం వ్యవరించిన తీరే ఈ ప్రభుత్వం కూడా వ్యవరిస్తుంది.ఇచ్చిన హామీలను అమలు జరపకపోతే రాబోయే కాలంలో పోరాటాల సిద్ధమవుతావని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్నాం.
ఈ సమావేశంలో గురువక్క,కనక దేవేంద్ర,
కోట్నాకసాంద్రుబాయి,సాయక్క,అంకమ్మ,మణెమ్మ,కమలాబాయి,పోషక్క తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్