కనిపించని పారిశుద్ధ్య పనులు
మంగపేట,సెప్టెంబర్ 06
మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులను సక్రమంగా చేయక పోవడం వల్ల ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలు డెంగీ మలేరియా జ్వరాలు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారని ఆదివాసి సేన మంగపేట మండల అధ్యక్షుడు పోలేబోయిన ఆదినారాయణ అంటున్నారు.గ్రామాలలో పారిశుధ్య పనులు కొరవడ డంతో అంటూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి గ్రామలలొ దోమ ముందు పిచికారి చేయాల్సి ఉన్న చేయడం లేదు ఏజెన్సీ ప్రాంతం ప్రజలను పట్టించుకునే అధికారులు లేరా? గ్రామ పంచాయతీ అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు పట్టింపు చర్యలు చేయడం లేదు.వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ వారు ఫాగింగ్ కాలువల్లో బ్లీచింగ్ చేయించాలని ప్రజల ఆరోగ్య రక్షణ కొరకు చర్యలు తీసుకో వాలని ఆదివాసి సేన మండల అధ్యక్షుడు పోలేబోయిన ఆది నారాయణ కోరుతున్నారు.