నేరాలు

పేకాట స్థావరంపై దాడి ఆరుగురిని అరెస్టు చేసిన ముస్తాబాద్ ఎస్ఐ …

122 Views

ముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్దికుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు మా సిబ్బందితోపాటు పేకాట స్థావరంపై దాడి చేయగా అక్కడే పేకాడుతున్న మద్దికుంట గ్రామానికి చెందిన 06,వ్యక్తుల వద్ద రూ 9470 నగదు, 05, సెల్‌ఫోన్లు, 03 ద్విచక్ర వాహనాలు, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్