*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*నేన్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సిపి*
*రిసెప్షన్ రికార్డ్స్, స్టేషన్ పరిసరాలు పరిశీలన*
*ప్రతి గ్రామం సందర్శించాలి, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*
రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నేన్నెలా పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., తో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడివారు చేసే విధులు మరియు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ఈ ప్రాంతం ఉన్న మావోయిస్టుల, కుటుంబ సభ్యుల వివరాలు, సానుభూతి పరుల వివరాలు, ఇక్కడ ఉండే ప్రజల గురించి, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్, పొలిటికల్ సమస్యలు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ వివరాలు ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల సంబందించి ఎస్ఐ, సిబ్బంది గ్రామాలను సందర్శించి సమస్యత్మక గ్రామాలు, ట్రబుల్ మంగర్స్ గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామాలలోని ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది అదేవిదంగా ప్రజల తో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుని ప్రతిష్ట మైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. అధికారులు మరియు సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, అక్రమ రవాణా పై పూర్తి నిఘా ఉంచి నియంత్రించాలని, ప్రతి గ్రామం సందర్శించాలి, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు.





