ప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి
– కూతురుకు గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కూతురు అక్షయ 16 కు గాయాలు కాగా చికిత్స పొందుతుంది. మృతురాలి భర్త నరసయ్య రోజు వారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండగా తమ ఇంటి కాంపౌండ్ కూలి తన భార్య మరణించడం పట్ల కుటుంబ సభ్యులు బోరుణ విలపిస్తున్నారు. ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
