Breaking News

పర్యటన ఖరార్

146 Views

తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్

హైదరాబాద్:అక్టోబర్ 17

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజు కు దూకుడుని పెంచుతుంది, దీనిలో భాగంగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిచున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది.

ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ ప్రియాంక గాంధీ రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేపు సాయంత్రం 4 గంటల సమయంలో దర్శించుకుంటారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను శివుడి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుల్ గాంధీకి శివుడిపై విశ్వాసం ఉంది. శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

మొదటిరోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు.

రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్రను రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ , కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *