గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




