మంచిర్యాల జిల్లా.
కోనో కార్పస్ మొక్కల వల్ల శ్వాస కోసం వ్యాధులు వస్తున్నాయి.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కోనో కార్పస్ మొక్కలను కట్ చేయడం జరుగుతుంది.
ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నారు.
ఉన్న చెట్లను కట్ చేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సింది మంచిర్యాల మున్సిపాలిటీ వారికి బాధ్యతలు అప్పగించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డివైడర్స్ మరియు ప్రధాన రహదారుల్లో నాటిన కోనో కార్పస్ చెట్ల వలన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టకి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి కోనో కార్పస్ మొక్కలను కట్ చేయించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటించాల్సిందిగా మంచిర్యాల మున్సిపల్ వారికి బాధ్యతల అప్పగించారు. ప్రజల ఆరోగ్యo దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారులు అయినా బైపాస్ రోడ్లో, కాలేజీ రోడ్ లో, ఉన్న మొక్కలను కట్ చేయించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సిందిగా మంచిర్యాల మున్సిపాలిటీ వారికి సూచనలు చేశారు.
మంచిర్యాల మున్సిపాలిటీ వారు కొనో కార్పస్ మొక్కలను కట్ చేయించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
