ప్రాంతీయం

మూడు 108,102 అంబులెన్స్ల మంజూరు చేసిన ప్రభుత్వం

64 Views

మంచిర్యాల జిల్లా.

ప్రజా పాలన ప్రజా విజయోత్సల భాగంగా మంచిర్యాల జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  రేవంత్ రెడ్డి  ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుబాటులో నికి తేవడంలో భాగంగా 108 అంబులెన్స్ సర్వీసులను మూడింటిని మంజూరు చేయించడ జరిగినది. ఈ మూడు అంబులెన్సులు హాజీపూర్, తాండూర్, భీమారం మండలాలకు కేటాయించినారు. వీటి సేవలు కూడా ప్రారంభించడం జరిగినది. ఈ అంబులెన్స్ల ద్వారా సత్వర వైద్య సేవలకు అత్యవసర కేసులకు 15 నిమిషాల లోపలనే 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా 102 అమ్మఒడి అంబులెన్సులు మూడింటిని జిల్లాకు కొత్తవాటిని ఇవ్వడం జరిగినది. వీటిని చాలా రోజుల నుండి నడుస్తున్న పాత అంబులెన్స్ల స్థానంలో హాజీపూర్, దండేపల్లి కేటాయించడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందించడంలో భాగంగా ఈ కేటాయింపులు చేయడం జరిగినది. దీని ద్వారా జిల్లాకు  మొత్తం 18 అంబులెన్సులు ప్రజలకు వైద్య సేవ అందిస్తాయి, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు 108 జిల్లా మేనేజర్ సంపత్ మరియు తెలంగాణ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నావి కావున జిల్లాలోని ప్రజలందరూ 108 అంబులెన్స్ సర్వీస్ లను ఉపయోగించుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయానికి అందరూ తోడ్పాటు చేయాలని కోరినారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్