ప్రాంతీయం

రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష ముగింపు కార్యక్రమం

123 Views

 

← Back

Thank you for your response. ✨

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 40రోజుల నుండి నిర్విరామంగా నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఆదివారం నాడు కృష్ణాలయంలోని రామాలయంలో ముగింపు కార్యక్రమం చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోటితో రామ నామ స్మరణ చేసుకుంటూ గోటితో వడ్లను ఓలిచి భక్తిని చాటుకున్నారు. భద్రాచల సీతారాముల కల్యాణానికి మన గజ్వేల్ నుండి తలంబ్రాలు వెళ్లడం చాలా అనందంగా భక్తులు కొనియాడారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల దేవస్థానం వారు మాకు ఇచ్చిన ఈ సదవకాశాశాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.

ఈరోజు కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షులు ఎలగందుల రాంచంద్రం, ఉప్పల వెంకటేశం, దూబకుంట మెట్రాములు, అత్తెల్లి లక్ష్మయ్య, ఉప్పల మధుసూదన్, సుందర సత్సంగ సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *