ఆదిలాబాద్ జిల్లా.
*కామ్రేడ్.ఎన్ . బాల మల్లేష్ కామ్రేడ్. పోటు ప్రసాద్ లకు ఘన నివాళులు*
ఆదిలాబాద్ జిల్లా భూక్తపూర్ సిపిఐ – ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం లో సిపిఐ – ఏఐటీయూసీ ఎ. ఐ. కె. ఎస్ -ఎ. ఐ. వై. ఎఫ్.జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండె పోటులతో కామ్రేడ్స్ ఎన్ . బాల మల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండె పోటు లతో చనిపోవడం తో వారికీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ . విలాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రO లో సిపిఐ పార్టీకి తీరని లోటన్నారు ఎన్ . బాల మల్లేష్ ఎ. ఐ. ఎస్. ఎఫ్.నుండి ఎదిగి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఏదగడం సిపిఐ పార్టీ గర్వాంగా ఫిలైందన్నారు కానీ అది ఎక్కువ రోజులు ఉండలేదాన్నారు. కామ్రేడ్ బాల మల్లేష్ చాలా కమిట్ మెంట్ తో సిపిఐ పాటికి సేవాలాందించారాని అలాగే కామ్రేడ్ పోటు ప్రసాద్ కూడా ఎ. ఐ. ఎస్. ఎఫ్.నుండి ఎదిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏఐటీయూసీ కి నాయకత్వం వహించారన్నారు వారిది త్యాగల కుటుంబం అని కొనియాడారు. సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర.దేవేందర్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్ . బాల మల్లేష్ మరియు పోటు ప్రసాద్ రెండు మూడు రోజుల్లో మరణించడం సిపిఐ రాష్ట్ర పార్టీ కి తీరని లోటని రాష్ట్ర వ్యాప్తంగా 2-3రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు సోకాసంద్రంలో దిగ్బ్రాంతితో మునిగి పోయారన్నారు. మా ఆదిలాబాద్ జిల్లా సమితి లుగా మా నాయకుల మరణం పట్ల చాలా బాధగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ .అరుణ్ కుమార్ చిల్కా దేవిదాస్ మెస్రం భాస్కర్ సిపిఐ జిల్లా నాయకులు వాసీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
