ప్రాంతీయం

53 Views

ఆదిలాబాద్ జిల్లా.

*బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.*

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరు బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులం ఖండిస్తూ ఈనెల 4న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పిద్దామన్నారు కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్. నగేష్ .ఆకుల ప్రవీణ్ .కృష్ణ యాదవ్. జోగు రవి. దినేష్ మాటోలియ. విజయ్.రాజన్న. సోమా రవి. దయాకర్. అర్జున్. తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్