సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం దౌల్తాబాద్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి గజ్జల్ల కనకరాజుకి శనివారం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వ్యవస్థలో గత 15 సంవత్సరాలుగా వెట్టి చాకిరికి గురవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే తదనంతరము ఉద్యోగులంతా సమ్మెకు వెళ్లడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అక్కం శేఖర్, ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘ సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది, మమత, రాజేశ్వరి పాల్గొన్నారు.
