తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం దీక్ష దివాస్ ,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెడానికి బీజం పడిన క్షణం ఈ దినం.
మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు దీక్షా దివాస్ సందర్భం పురస్కరించుకుని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ *మాదాసు శ్రీనివాస్* ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ nc రాజమౌళి, జడ్పీటిసి మల్లేశం, తెరాస మండల అధ్యక్షుడు బెండే మధు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ దినం మరిచిపోలేని రోజూ అని వారు పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు అని గుర్తు చేస్తూ ఉద్యమ నేత కేసీఆర్ గారు 2009 లొ ఇదే రోజున దీక్ష చేపట్టారని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అంటూ ఆయన చేపట్టిన దీక్ష కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేన రోజుగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. పట్టుదలతో చేసే పోరాటంలో నిజాయితీ ఉంటే ఎంతటి వారైనా మోకరిల్లక తప్పదని నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు.ఆరోజు ఒక్క దీక్ష ఢిల్లీ సర్కారును కంపింపజేసిందని
అప్పటి వరకు సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి దీక్షా దివస్ కొత్త ఊపిరి పోసిందని అన్నారు.. కులాలు, మతాలు, పార్టీలు.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమించడానికి ప్రేరణ ఇచ్చిందని లాఠీలు, తూటాలు, వంటివి ఆరోజు సమైక్య పాలకులు ఉద్యమం మీద ప్రయోగించిన ఎంతటి నిర్బంధాన్నైనా నిలువరించే శక్తిని కేసీఆర్ గారు ఇచ్చారని అన్నారు..తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణను సాధించుకోవాలనే తెగింపును అందరిలో నింపిందని అన్నారు.
కెసిఆర్ గారి ఆమరణ నిరహార దీక్ష ఫలితంగానే భయపడి కేంద్రం దిగి రావడం జరిగిందని
డిసెంబరు 9వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అనుకూల ప్రకటన వచ్చిన విషయాన్ని వారు తెలిపారు. సమైక్య పాలకుల మోసపూరిత ఆలోచనలు ఎండగట్టి
వేలాది యోధుల ఆత్మబలిదానం…కె సి ఆర్ గారి ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణా సాధనకు దారి తీసిందని అన్నారు.
ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి నాయకత్వం లొ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకమిటి చైర్మన్ కృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జఖి, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి,కౌన్సిలర్లు ,తెరాస సీనియర్ నాయకులు గుంటుకు రాజు, రమేష్ గౌడ్, అహ్మద్ ,శ్రీనివాస్ నరసింహా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మకమిటి డైరెక్టర్లు, దేవాదాయ కమిటీ డైరెక్టర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..