మంచిర్యాల లో క్యాన్సర్ ఆసుపత్రికి అనుమతి
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మంచిర్యాల
మంచిర్యాల లో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో మంజూరు అయిన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాల లో ఏర్పాటు కు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ లకు కృతఙ్ఞతలు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. ముల్కళ్ల నుంచి బసంత్ నగర్ అనుసంధానం గా గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబరు లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లో ఎయిర్ పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాల లో రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రామా ఆసుపత్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు, క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు ఐటీ ఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకు మంజూరు అయినట్లు తెలిపారు. అలాగే కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ ఐ ఆసుపత్రి మంచిర్యాల కు మంజూరైందని కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించిన ట్లు వివరించారు. రాళ్ళవాగు పై వంతెన నిర్మాణం, వంద ఫీట్ల రోడ్ కు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో నిరుపేద లకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
మంచిర్యాల లో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాల లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేల కృషి చేస్తానని చెప్పారు.
ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
