ప్రాంతీయం

వైభవంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

139 Views

*వైభవంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం*

తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం 21వ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నలుమూలలా, ప్రతి గ్రామంలో పండుగగా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ లు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచిపెట్టి, వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య ముదిరాజ్, జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్ ముదిరాజ్ లు ముఖ్య అతిథులుగా హాజరై, ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముదిరాజ్ లను బిసి-డి నుండి బిసి-ఏ లోకి మారుస్తామని హామీ ఇచ్చి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ముదిరాజ్ లు ఆత్మాభిమానంతో బతకాలి తప్ప, బానిసలుగా బతకరాదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ముదిరాజ్ లు పదవులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్, నాయకుడు కంకణాల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల తిరుపతి, ముదిరాజ్ కుల బాంధవులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్