Breaking News

కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

514 Views

-ప్రమాదంలో ముగ్గురు మృతి..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

రాజీవ్ రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బిహార్ కూలీలను ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు డి కొట్టగా, నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బీహార్ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు..కారు పాల్టీకొట్టగా కారు నడుపుతున్న బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ తాడూరి వెంకట్ రెడ్డి పరిస్థితి విషమించగా రేణిగుంట టోల్ ప్లాజా సిబ్బంది తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
తిమ్మాపూర్ ఎస్ఐ తాండ్ర వివేక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.మృతదేహలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found