విజిత్ రావు ఎమ్మెల్యే కావడం పగటి కాలే – కాంగ్రెస్ నేతలు.
తన కుమారుడు నడిపెళ్లి విజిత్ రావును ఎమ్మెల్యే చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ లు రావుల ఉప్పులయ్యా, వేణు, వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ ప్రధాన చిట్ల సత్యనారాయణ మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు దివాకర్ రావును ఓడించినప్పటికి ఆయనలో పరివర్తన రావడం లేదని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తుంటే విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. నీకు ఏడూ పదుల వయసు వచ్చింది రాజకీయాలకు స్వస్తి పలికడం మంచిదని హితవు పలికారు. నీ కొడుకు రాజకీయాలకు పనికి రాడని ఏదైనా వ్యాపారం చేయించుకోవాలని సూచించారు. తండ్రి, కొడుకుకు బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వదని అన్నారు.
మేమే మంచి మంచిర్యాల తీశాం
ఐబీ చౌరస్తా లోని మంచి మంచిర్యాల
బోర్డును ఎవరు ఎత్తుకుపోలేదని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో భద్రంగా ఉందని చైర్మన్ ఉప్పలయ్య తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం సందర్భంగా బోర్డు దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయం కు తరలించామని చెప్పారు. కమీషనర్ కు సమాచారం లోపం వల్ల తెలియదని చెప్పాడని అన్నారు.
ఈ విషయాన్ని కూడా రాద్దాంతం చేసి రాజకీయం చేయాలని చూడడం శోచనీయమన్నారు.
ఇష్టానుసారంగా విమర్శలు చేసి కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు.





