మంచిర్యాల జిల్లా.
ఆశ్రమ పాఠశాల పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.
మాజీ మంత్రి హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే.
ట్విట్టర్ రాజకీయాలు కాదు. పిల్లల భవిష్యత్ మార్చే రాజకీయాలు చేయండి: ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు.
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థుల విషయంలో మొసలి కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు.
గతంలో మీ పాలనలో విద్యా, వైద్యం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటే బాగుంటుంది.
మీరు చేసిన పదేళ్ల పాపమే పిల్లలు మోయాల్సిన పరిస్థితి ఎదురైంది.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వం..
మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 300 మంది ఉదయం కిచిడి తింటే ఒక్కరు మాత్రమే స్వల్ప అస్వస్థత కు గురయ్యారు.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మరో 11 మందిని ఆస్పత్రికి తరలించాం.
విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు.
విద్యార్థుల అనారోగ్యాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణం.
హరీష్ రావుకు చాలెంజ్ విసురుతున్నా, నా నియోజక వర్గం లో ఏ ఆశ్రమ పాఠశాలకైనా రమ్మనండి, ఫుడ్ మెను పరిశీలించమనండి.
మీలా మునిగిపోయే చోట మాతాశిశు ఆస్పత్రులు, హస్టల్లలో పురుగుల అన్నం భోజనాలు పెట్టే కర్మ మాకు పట్టలేదు.





