ప్రాంతీయం

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్

101 Views

మంచిర్యాల జిల్లా.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ సాయి కుంటలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి తగు సూచనలు జారీ చేసినారు.

ఆశ్రమ పాఠశాలలో ఈరోజు 12 మంది విద్యార్థులకు వాంతులు జరగడం వలన వాంతులు వస్తాయని అన్న భయంతో విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది. ఇందులో భాగంగా ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరమును ఏర్పాటు చేసి ఆశ్రమ పాఠశాలలో వంటగదిని, వంట పాత్రలను తనిఖీ చేయడం జరిగినది. తీసుకున్న ఆహార పదార్థాలు త్రాగే నీరు మంటకు ఉపయోగించే నీటిని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల ద్వారా నమూనాలను సేకరించడం జరిగినది. అదేవిధంగా పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. జిల్లా ఆస్పత్రిలో 12 మంది విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల పైన తెలుసుకొని సాగుతూ సూచనలను అందించడం జరిగినది. పిల్లలందరూ ఎలాంటి ఫుడ్ పాయిజన్ కు గురి కాలేదని వాంతులు మాత్రమే చేసుకున్నారని వైద్య సహాయం అందించడం జరుగుతున్నదని తెలియజేసినారు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని భయపడే అవసరం లేదని తెలియజేసినారు.

డాక్టర్ శ్రీధర్ ఆర్ ఎం ఓ, డాక్టర్ అనిత డిప్యూటీ వైద్యాధికారి, డాక్టర్ అశోక్ సుమన్, వైద్య సిబ్బంది వెంకట సాయి, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, శ్రీ గంగారాం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఉపాధ్యాయులు మరియు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్