ప్రాంతీయం

మోడీతో డిజిటల్ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం

146 Views

మంచిర్యాల జిల్లా

ఈరోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ  ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 129 ఆరోగ్య సేవ కేంద్రాలలో డిజిటల్ ద్వారా ప్రజలకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఉపయోగాలు గూర్చి తెలియజేశారు. 70 సంవత్సరము పైబడిన వారందరికీ ఆరోగ్య ఇన్సూరెన్స్ బీమా సౌకర్యము కల్పించడము, ఉచితంగా ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందించడానికి ప్రారంభించినారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అంటు వ్యాధులు అసంకరమైన వ్యాధులు జీవనశైలిలో మార్పులు పిల్లలకు టీకాలు ఇంకా క్షయ కుష్టు వ్యాధి నివారణ పిల్లల్లో పౌష్టికార లోపంతో వచ్చే వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు ఆహారపు నియమాలు పౌష్టికాహారాన్ని అందించడం సికిల్ సెల్ గుర్తించి మందులు అందజేయడం ప్రజలందరికీ అందుబాటులోనికి ఆరోగ్య సేవలు చేయడం కోసం సందేశాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి మరియు వైద్యాధికారులు సిబ్బంది ఆయా కేంద్రాలలో ప్రోగ్రాం ఆఫీసర్లు, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పాల్గొన్నారు. బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి కాంతారావు ప్రశాంతి డిపిఓ మరియు ఆయా కేంద్రాలలో డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ కృపాబాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్