ప్రాంతీయం

నిరుపేదల ఆత్మీయ బంధువు ముఖ్యమంత్రి కేసీఆర్* *మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్*

139 Views

 

గజ్వెల్అ మండలం లోని ఆహ్మదీపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కే మమతా అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరగా వారికి హాస్పిటల్స్ ఖర్చులు నిమిత్తం 45000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కును ఆమె భర్త జైపాల్ కి ఆదివారం అందచేయడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. అనారోగ్యాల బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారికి CMRF ద్వారా ఆర్థిక చేయూతను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి చేస్తున్న విషయాన్ని వారు తెలిపారు. ముఖ్యమంత్రి గారి కెసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిన విషయాన్ని వారు స్పష్టంచేశారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా టిఫ స్కానింగ్ ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.. ఈ సౌకర్యం కలిపించడం ద్వారా దాదాపు మూడు వైల రూపాయలు ఆదా అవుతుందని ఇంతకుముందు ఇటువంటి సదుపాయాలు లేవని ప్రయివేటు హాస్పిటల్స్ వెళ్లకుండా ప్రభుత్వ హాస్పటల్లో ఇటువంటి సదుపాయాన్ని కలిపించడం ముఖ్యమంత్రి కేసీఆర్ దాతృత్వాని అర్థం చేసుకోవచ్చని తెలిపారు..అన్ని సౌకర్యాలు కలిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వనికి మనం అండగా నిలవాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్,తెరాస నాయకులు కొత్తపల్లి రామగౌడ్, నాంపల్లి, సత్యం, తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7