రామగుండం పోలీస్ కమీషనరేట్
తేది :10-01-2024
గోళీవాడ వద్ద గల సమ్మక్క గద్దెలను సందర్శించిన గోదావరిఖని ఏసీపీ
రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇతర శాఖ అధికారులతో సమావేశం
అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోలివాడ గోదావరి నది సమీపంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాన్ని గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, వచ్చే నెల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాట్లు, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగా కుండా, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు, ఏలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారుల మరమ్మత్తు, పార్కింగ్ స్థలాల గుర్తింపు, త్రాగు నీటి ఏర్పాట్లు, స్నానాలు ఘాట్ పరశీలన, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు, విద్యుత్ లైట్స్, సౌకర్యం, సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ఏర్పాట్లు, ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, కావాల్సిన వాటిపై అధికారుల, ప్రజా ప్రతినిధులతో చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సి.ఐ రామగుండం చంద్రశేఖర్ గౌడ్,ఎస్ఐ B. సంతోష్ కుమార్, ఎంపిడిఒ బి. యాదగిరి
సర్పంచ్: డి.రాజేష్, సమ్మక్క గద్దల చైర్మన్: పెండ్రి హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
