ముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లాలోని బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి జెల్లా వెంకటస్వామి చేతుల మీదుగా పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం రచించి, భారతదేశ సంస్కృతిని, కట్టుబాట్లను అందించిన మహాకవిఅని పురాణ భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని రచించిన ఘనత పొందిన వాల్మీకి మహర్షి జన్మదినాన్ని వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో వాల్మీకి గొప్పకవులు ఆయన ఋషులలో ఒకరిగా గౌరవించ బడ్డారు. రామాయణం చదవడం లేదా వినడం సాహిత్యం, ఆధ్యాత్మికతకు వాల్మీకి చేసిన కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీస్టడీ సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




