ప్రాంతీయం

మంచిర్యాలలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

52 Views

మంచిర్యాల జిల్లా.

నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్,.ఎం.ఎస్.పి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ వ్యక్తం చేసిన మాదిగ సంఘాలు.

డీఎస్సీ ఫలితాలలో ఎస్సి వర్గీకరణను అమలు చేయకుండా, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాదిగ సంఘాలు తీవ్రంగా ఖండించారు.

రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మాదిగ సంఘాలు నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ ఫలితాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని అదేవిధంగా రాబోయే కాలంలో గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ   చేయాలని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి మంచిర్యాల జిల్లా నాయకులు రాయపాక మల్లేష్ మాదిగ, మంత్రి మల్లేష్ మాదిగ, మంతెన మల్లేష్ మాదిగ, గాలిపాక సత్యం మాదిగ, గద్దెల బానయ్య మాదిగ, శంకర్ మాదిగ తదితర ముఖ్య ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి మంచిర్యాల జిల్లా ముఖ్య నాయకులు ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్