ప్రాంతీయం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి…

584 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి30, సీతారాముల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెండ్లీ మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కళ్యాణం సాగింది. బంధనకల్  గ్రామ మాంకాలమ్మ దేవాలయ ఆద్వర్యంలో చేపట్టిన శ్రీరామయ్య- సీతమ్మల కళ్యాణం  నేత్ర పర్వంగా సాగింది. వేదపండితుల సూచించన సమయాన పట్టాభిరాముడు సీతమ్మను వివహమాడాడు. వివాహన్ని తిలకించేందుకు మంగళహరతులు, ఓడిబియ్యతో మహిళలు, స్వామివారికి నూతన వస్త్రాలు, బంగారు ఆబరణాలతో భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి వివాహవేడుకలను తిలకాంచరు. ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈకళ్యాణ మహోత్సవ వేడుకలకు బంధనకల్ రెడ్డిసంఘం నాయకులు కుటుంబ సభ్యులు వివిధ హోదాలు కలిగిన వారు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, కరెడ్ల రమేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నల్ల బాపురెడ్డి కస్తూరి వెంకటరెడ్డి.లు , నల్ల శ్రీనివాస్ రెడ్డి తో పాటు తదితరులు హజరై  ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి రామయ్య కల్యాణం సందర్భంగా మండలంలో పలు గ్రామాల్లో పండుగ పచ్చతోరణాలు వాతవరణం నెలకొంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *