మంచిర్యాల జిల్లా
హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ మూడో సారి అధికారంలోకి రావడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ముఖారం చౌరస్తాలో గెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరియు హర్యానా లో బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని విశ్వసించి ఆ రాష్ట ప్రజలు మరొకసారి బీజేపీ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు కోసం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మకుండా అభివృద్ధికి మరియు సంక్షేమానికి ఓటు వేశారని అన్నారు. మోదీ నాయకత్వంలో ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధిలో భారత దేశం వికసిత్ భారత్ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతారని అదే విధంగా 2028 ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, ఎనగందుల కృష్ణ మూర్తి, బొడ్డు రఘునందన్, గోలి రాము, పేరం రాజయ్య, రాకేష్ రెన్వా, మట్టుపల్లి జయరామ రావు, పచ్చ వెంకటేశ్వర్లు, బొద్దున మల్లేష్, నాగుల రాజన్న, రెడ్డిమళ్ల అశోక్, స్వప్న రాణి, స్వాతి, శారద దేవి, అమీరుశెట్టి రాజు, అర్జున్, రాజమౌళి, బింగి సత్యనారాయణ, రాజ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.





