ప్రాంతీయం

దేవీ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని – సి పి

44 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి*

*రామగుండము కమీషనరేట్ పరిధిలో మొత్తం దుర్గామాత విగ్రహాలు (566) ఏర్పాటు చేయడం జరిగింది*

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలి. దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రస్, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలి. దుర్గామాత మండపం రోడ్డు ప్రక్కన గాని ఖాళీ స్థలంలో గాని నిర్మించాలి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలి. మండపాల వద్ద సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించాలీ. విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద విధిగా ఒకటి లేదా రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదం జరగకుండా అన్రుని జగ్లరత్కుహాలు తీసుకోవాలి ఇబ్బంది కలుగకుండా భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలి. దుర్గామాత మండపాలు యొక్క విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి భద్యత వహించవలెను. నిమజ్జనం కొరకు ఏ రోజు ఎక్కడికి ఏ మార్గం ద్వారా తీసుకువేల్తారు అనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలుపండి. పెద్దలు నిర్ణయించిన తేదీ లోపల నిమజ్జనం పూర్తి చేయాలి. మండపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో మరియు ఎటువంటి చిన్న సమాచారం ఉన్నా మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి లేదా డయల్ 100 కు ఫోన్ చేసి తెలుపగలరు. దుర్గామాత మండపము వద్ద బ్యారికేటీంగ్ కట్టాలి. రెచ్చగొట్టే పొస్టర్లు గాని, బ్యానర్లు గాని, కరపత్రాలను గాని పంచకూడదు, అంటించకూడదు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను, పుకార్లు నమ్మరాదు. దుర్గ మాత విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో షీ టీం సిబ్బంది మాఫ్టీ లో గమనిస్తూ ఉంటారు. గ్లూకోస్ పెట్రో కార్స్ మరియు నైట్ పెట్రోలింగ్ అధికారులు విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను అధికారులు సందర్శిస్తుంటారు. ప్రజల సౌకర్యం కొరకు పోలీసు నిఘా, భద్రత ఏర్పాటు చేయడం జరిగినది నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ వారి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దుర్గామాత పండుగ మరియు నిమజ్జనం జరుపుకోవాలని సీపీ  సూచించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్