ప్రాంతీయం

బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి

36 Views

 

 

బీసీ కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి. రుణమాఫీ కానీ వారందరికీ వెంటనే రైతు రుణమాఫీ చేయాలి

ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు.

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3

రాష్ట్రంలో ఎక్కువ జనాభా బీసీలు కాబట్టే బీసీ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని అలాగే రాష్ట్రంలో రుణమాఫీ పేరిట కొందరికి మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది కానీ వారికి తక్షణమే ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మిరుదొడ్డి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత ప్రభుత్వం బీసీ ఎసి ఎస్టీ ప్రజల్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన జరపకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కూడా పుట్టగతులు లేకుండా పోతుంది.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలకు రాజకీయ ప్రాతిని రిజర్వేషన్లని పెంచుతామని చెప్పిన విధంగా బీసీ కులగనన పూర్తిస్థాయిలో చేపట్టిన తర్వాతనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్