ప్రాంతీయం

ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి

46 Views

గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి – ర్యాకం యాదగిరి

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 2

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి అన్నారు బుధవారం మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మంత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరవుతారని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారధ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పరిపాలన కొనసాగుతుందని, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారాధ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పురోగమిస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ భేరి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు,

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్