జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 09
జిల్లా ఆసుపత్రిలో చేపడుతున్న పీడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించి, పిడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో 31 లక్షల రూపాయలతో 30 పడకల జనరల్, 12 పడకల ఐసీయూ వార్డు ఆధునికీకరణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. పనుల పురోగతిలో వేగం పెంచి 15 రోజుల్లోగా పిడియాట్రిక్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. అలాగే ఆసుపత్రి ఆవరణలోని గార్డెన్ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ పరిశీలనలో సందర్భంలో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
