కథనాలు

ఆధారపూరిత వార్తలు రాశారు.ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ బృందం ఆరోపణలు సరైనవి కావు*

108 Views

ఆధారపూరిత వార్తలు మాత్రమే రాశారు ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ బృందం ఆరోపణలు సరైనవి కావు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ శివరాత్రి నర్సింహులు ఒగ్గు బాలరాజు యాదవ్ పై చేసిన ఆరోపణలు అసత్యమని గంభీరావుపేట సేస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ శివరాత్రి నరసింహులు, వీరవేని రమేష్ లు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయడం సైరయింది కాదని, అన్ని ఆధారాలతో రాయడం జరిగిందని అన్నారు. ఉప సర్పంచ్ శివరాత్రి నర్సింలు గతంలో ఇన్చార్జి సర్పంచిగా పనిచేసిన సమయంలో లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు. వీర వేణి రమేష్ ఉపసర్పంచ్ నరసింహులు గ్రామం శాంతియుతంగా ఉన్నప్పటికీ గ్రామంలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. అత్తర్ సెంట్ పరిశ్రమకు ఇన్చార్జి సర్పంచ్ గా ఉన్నప్పుడే నరసింహులు అనుమతి ఇవ్వకుండా అక్బరుద్దీన్ అనే వ్యక్తి అమాయకుడని ఆయనను వారి సొంతానికి వాడుకుంటున్నారని అన్నారు. గతంలో రమేష్ శిఖం భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు.. గ్రామంలో అలజడికి కారణంగా మారిన నరసింహులు, రమేష్ పై పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇన్చార్జి సర్పంచిగా పనిచేసిన శివరాత్రి నర్సింలు తను పనిచేసినప్పటి లెక్కలు అప్పగించాలని చెప్పినా సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన కొక్కు సంధ్యారాణి యాదవ్ కు లెక్కలు అప్పజెప్పడం లేదని డిపిఓ రవీందర్, ఎం పి ఓ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రాజు లు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా శివరాత్రి నరసింహులు 187 సర్వేనెంబర్ లో భూమి కబ్జా చేశాడని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయగా మండల తహసీల్దార్ నర్సింలు దగ్గర నుండి భూమిని స్వాధీనం చేసుకోవడానికి నోటిస్ లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిపై హక్కులు కల్పించాలని గ్రామ సభలో ఉపసర్పంచ్ శివరాత్రి నర్సింహులు చిందులు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తఫానగర్ గ్రామస్తులు వీరబోయిన దశరథం, బండ రవి, కూడేల్లి రాజు, దోమకొండ మల్లేశం, శివరాత్రి పెంటయ్య, బోదాసు లస్మయ్య, స్వామిబొంతల హనుమంతు, కూడెల్లి రాజు, కూడెల్లి గంగయ్య, శివంది దేవయ్య, రాపెల్లి సుజాత,దోమకొండ హనుమయ్య, దోమకొండ పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్