ప్రజావాణితో సమస్యల పరిష్కారం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మొత్తం 126 దరజాస్తుల రాక ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి.
రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, డీఆర్డీఓకు 10, జిల్లా విద్యాధికారికి 9, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 7 చొప్పున, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి 5, ఎస్డీసీ, ఎస్పీ ఆఫీస్ కు 4 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, సెస్ కార్యాలయానికి 3 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఏ డీ ఎస్ ఎల్ ఆర్, జిల్లా ఉద్యానవన అధికారికి రెండు చొప్పున, జిల్లా వైద్యాధికారి, ఈఈ మిషన్ భగీరథ, సబ్ రిజిస్టర్ సిరిసిల్ల, ఈఈ పీఆర్, డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీస్, ఎంపీడీఓ తంగళ్ళపల్లి, ఇల్లంతకుంటకు ఒకటి చొప్పున వచ్చాయి.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





