చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26
చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది పలికిందని సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అన్నారు, గురువారం రోజున చాకలి అయిలమ్మ జయంతి సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పిడిశెట్టి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ నాడు భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలను ఎదురించి ఐలమ్మ తిరుగుబాటు చేయడం చాలామంది మహిళలు సాయుదులు కావడానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు ఐలమ్మ పై కక్ష పెంచుకున్న విష్ణురు రామచంద్రారెడ్డి దొర ఐలమ్మ పండించిన పంటలను దోస్కరమ్మని తన అనుచరులను పంపించడం తో అప్పటికే విషయం తెలుసుకున్న ఐలమ్మ మరియు కమ్యూనిస్టు కార్యకర్తలు ధాన్యానికి రక్షణగా నిలబడింది దొరల గుండాలు కళ్ళం దగ్గరికి రావడంతో ఐలమ్మ కొంగు నడుముకు చుట్టి రోకలి బండ చేతబట్టి వారిపై దాడికి పాల్పడి విరోచితంగా పోరాడిందని మరోపక్క కమ్యూనిస్టు కార్యకర్తల దాటికి గుండాలు తట్టుకోలేక ధాన్యాన్ని వదిలిపెట్టి పారిపోయారని తెలిపారు ఆ తెగువ తో మహిళల్లో మరింత స్ఫూర్తిని రగిలించిందని సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోయిని మనోహర్, బొప్ప నాగయ్య , నీల బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఇట్టమైన కనక చంద్రం, రాజక సంఘం నాయకులు నాయన మల్లేశం ,నాయిని కిష్టయ్య ,నాయిని సత్తయ్య ,నాయిని ప్రభాకర్ ,నాయిని రాకేష్ తుమ్మలపల్లి శ్రీనాథ్ మరియు గ్రామస్తులు ఇరు మల్ల కుమార్ ,కిష్టయ్య ,ఐలయ్య ,మల్లేశం ,సాయిలు , కొమురెల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
