ప్రాంతీయం

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

41 Views

నేడు సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర యువజన నాయకులు రాజి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నిముషాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు సకాలంలో హాజరై చెక్కులు తీసుకోగలరని పేర్కొన్నారు. మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో ఎంపికైన లబ్ధిదారులు సకాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka