ఏబీవీపీ అద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
– విమోచన దినోత్సవాణ్ణి ప్రజాపాలన దినోత్సవం అనటం సిగ్గుమాలిన చర్య.
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వీర సావర్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ “భారత దేశం మొత్తానికి ఆగస్ట్ 15 1947న స్వేచ్ఛ లభించింది కానీ తెలంగాణ మొత్తం ఇంకా నిజాం పరిపాలనలోనే ఉంది.దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నా కానీ తెలంగాణలో ఇంకా బానిస సంకెళ్లకు బందిలో ఉన్నారు. నిజాం పరిపాలన బ్రిటిష్ పరిపాలన కన్నా ఘోరంగా ఉండేది. ఇది ఎలాంటి పోరాటం అంటే రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామికవాదులు, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామ పోరాటమది.నానా అరాచకాలు సృష్టించారు హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు..ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో సైనిక బలగాలను తెలంగాణ నలుదిక్కుల నుండి మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమై శరవేగంగా నైజాం సంస్థానాన్ని భూస్థాపితం చేసే దిశగా తెలంగాణ అంతటా విస్తరించింది ఆర్మీతో పాటు ప్రజల తోడ్పాటు నిజాం సర్కార్ ను తరిమి కొట్టింది. దాదాపు 109 గంటలు సెప్టెంబర్13 నుంచి సెప్టెంబర్ 17 వరకు పోరాటం జరిగింది.సెప్టెంబర్ 17న 1948లో తెలంగాణ కు విమోచనం లభించింది.
ఈ కార్యక్రమంలో నగర సంఘటన కార్యదర్శి జగదీష్ , నగర సంయుక్త కార్యదర్శి అనీష్, వినయ్, అభి, సాయి, నాఫీజ్, కార్తీక్, షోయబ్,అనిల్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
