బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ . కేటీ రామారావు పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహనికి పాలాభిషేకం – డాక్టర్ రాజారమేష్.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, సుమన్ ఆదేశానుసారం చెన్నూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి పాలభిషేకం చేసిన చెన్నూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్. అనంతరం డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో అవమానం జరిగినందుకు క్షమించమని హృదయపూర్వకంగా వేడుకోవడం జరిగినది. ఏదైతే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మంటగలిపేటువంటి ఆలోచనలతో, అర్థరహితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో అర్థం కాక ప్రజలకు ఏమి చేయాలో తెలియక హామీలను నెరవేర్చడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సార్ ని విమర్శిస్తూ బతకడం, ప్రజలని ప్రజాపాలనా అనే పేరుతో ప్రజల ఇల్లులు కూలగొడుతూ రోడ్లపైకి లాగడం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులని నోటికొచ్చినట్టు తిట్టడం ఎజెండాగా పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాకపోతే కెసిఆర్ కాళ్ల మీద పడి రాష్ట్రాన్ని పరిపాలించడం నాకు చాతకావట్లేదు దయచేసి మీరే పరిపాలించాలని వేడుకుంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలకి మేలు జరిగేట్టు కేసీఆర్ ముందుకు వస్తారని తద్వారా సాధించుకున్న తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా వారి జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు.
ఈ రేవంత్ రెడ్డి సైకో చేష్టలకి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల మధ్య సమన్వయం లేదు ఢిల్లీలో ఉన్న గాంధీ కుటుంబం దగ్గర తన మాట చెల్లుబాటు కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు మంచి జరిగేట్టు నిర్ణయం లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని విమర్శించారు.
తెలంగాణ విద్యార్థులను ,ఉద్యోగులను రైతులను,మహిళలను, వికలాంగులను,వితంతులను వృద్ధులను అందరిని నమ్మించి మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ సాధ్యం కానీ వాగ్దానాలు ఇస్తూ వాగ్దానాలు త్వరలో నెరవేరుతాయని కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పరిపాలిస్తున్నరే తప్ప ప్రజలకి మంచి చేసి ప్రజల మన్ననలు పొంది పరిపాలిద్దామనే ఆలోచన లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతి త్వరలోనే గద్దె దింపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల పైన ఉందని కచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని గద్దె దింపితే తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడలేరని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్ లాల్ గిల్డ, నవాజుద్దీన్, దామోదర్ రెడ్డి,మంత్రి బాపు,మహేష్,అనిల్,శ్రీనివాస్,సురేష్ రెడ్డి,నాయిని సతీష్, విద్యా సాగర్,సంపత్,మహిళా నాయకురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.





